కాకతీయ, వరంగల్ సిటీ: వరంగల్ నగరం లోని కాశీబుగ్గ మున్సిపల్ సర్కిల్ ఆఫీస్ ను గురువారం కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి మేయర్ గుండు సుధారాణి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలో మహిళా సంఘాల ఉత్పత్తుల విక్రయానికి మార్ట్ ఏర్పాటు చేయనున్నట్లు వెళ్లడించారు. పనుల వేగవంతానికి క్షేత్ర స్థాయి లో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోటి మంది మహిళలకు కొటీశ్వరులను చేయాలనే దృఢ సంకల్పంతో మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. అందులో భాగంగా స్వయం సహాయక మహిళ సంఘాల వివిధ రకాల ఉత్పత్తులను ప్రోత్సహించుటకు గాను మహిళ మార్ట్ ను ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ తెలిపారు.
వరంగల్ పరిధికి సంబంధించి కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయం లో గ్రౌండ్ ఫ్లోర్ లో గల 5 గదులను పునరుద్ధరించి, మహిళ మార్ట్ త్వరితగతిన ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.ఈ కార్యక్రమం లో ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఏసీపీలు ఖలీల్ , ప్రశాంత్ ఇంచార్జి ఈ ఈ సంతోష్ బాబు, సూపరిండెంట్ హబీబ్, ఆర్వోషెహజాది బేగం, టీపీఎస్‌లు అనిల్, శ్రీకాంత్, ఏఈ హబీబ్ తదితరులు పాల్గొన్నారు.


