ప్రభుత్వ పాఠశాలో మహిళా దినోత్సవ వేడుకలు
కాకతీయ, పెద్దవంగర :మండలంలోని అవుతాపురం జడ్పి ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిసిఈఏఎస్ సి ఆధ్వర్యంలో బాలిక సాధికారతపై సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధానోపాధ్యాయులు కళదర్ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు బాలిక సాధికారతపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ సుంకరనేని నాగవాణి, ఉపాధ్యాయులు రమేష్ కుమార్,రామ్మోహన్, రవి,నరసింహారావు,వెంకటేశ్వర్లు,సింహాద్రి, నరసయ్య,సోమయ్య,రామ తార,శిల్ప,అజయ్ తదితరులు పాల్గొన్నారు.


