కాకతీయ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని ఓ ఎరువుల దుకాణం దగ్గర ఇద్దరు మహిళలు ఘోరంగా కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహబూబాబాద్ లోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం దగ్గర ఇద్దరు మహిళలు యూరియా కోసం వచ్చారు. అక్కడ ఆధార్ కార్డు నమోదు విషయంలో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో ఆ మహిళలు చెప్పులతో కొట్టుకుంటూ నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని దాడి చేసుకున్నారు. పక్కనే ఉన్నవారు వారిద్దరినీ విడదీయడంతో శాంతించారు.
యూరియా కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


