మహిళలు ఆర్ధిక ప్రగతిని సాధించాలి
దుగ్గొండి సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్
కాకతీయ, దుగ్గొండి: ఐకమత్యంతో పొదుపుల ద్వారా మహిళలు ఆర్ధిక ప్రగతిని సాధించాలని దుగ్గొండి మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్ అన్నారు. గ్రామంలోని రెండు మహిళ గ్రామైక్య సంఘాల భవన నిర్మాణానికి స్థలం కేటాయించి, భవన నిర్మాణానికి కావలసిన 200 గజాల స్థలాన్ని పంచాయితీ పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదంచిందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లె వైష్ణవి శ్యామ్, పంచాయతీ కార్యదర్శి వేణు ప్రసాద్, వార్డు సభ్యులు అశోక్, రవి, ప్రమోద్, రమేష్, సమ్మక్క మహిళ సమైక్య ప్రతినిధులకు తీర్మాన ప్రతులు అందించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతి నిధులు పాలక మండలికి కృతజ్ఞతలు తెలిపారు.


