కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బొల్లె పల్లి గ్రామానికి చెందిన అజ్మీర కమలమ్మ , పాము కాటు తో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు వారి ఇంటిలో నిద్రిస్తున్న క్రమంలో సుమారుగా రాత్రి 10 గంటల ప్రాంతంలో పాముకాటు వేయగా, స్థానిక ఏరియా గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు వైద్యం కోసం తరలించగా, పరిస్థితి విషమించడంతో అక్కడే మృతి చెందినట్లు తెలిపారు.


