ఎస్టీ జాతీయ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ సహకారంతో..
మహబూబాబాద్ లో రైల్వే మెగా డిపో.
రూపాయలు 908.15 కోట్లు మంజూరు.
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోని, తెలుగు రాష్ట్రాల్లో సరకు రవాణా రైళ్ల నిర్వహణ సదుపాయాల విస్తరణ కోసం , మహబూబాబాద్ జిల్లా లో కొత్తగా మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు బిజెపి రాష్ట్ర నాయకులు ఎస్టీ జాతీయ సెల్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ సహకారంతో, రూ.1,361 కోట్ల విలువైన పనులు మంజూరయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మహబూబాద్ జిల్లాలో ‘అంబ్రెల్లా వర్క్స్’ కింద మంజూరు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ద్వారా మంగళవారం ఉత్తర్వులుమంజూరికి కృషి చేసినట్లు తెలిపారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ కు రూపాయలు.908.15 కోట్లతో ‘మెగా మెయింటెనెన్స్ డిపో’ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో పీరియాడికల్ ఓవర్హెలింగ్, రెగ్యులర్ ఓవర్హోలింగ్, సిక్లైన్, ట్రైన్ ఎగ్జామి నేషన్ వంటి ఇతర కీలకమైన పనులు, సదుపాయాలు రానున్నట్లు తెలిపారు .దక్షిణమధ్య రైల్వే జోన్లో ఈ తరహా మెగా మెయింటెనెన్స్ మన జిల్లా కు డిపో రావడం ఇదే తొలిసారి అన్నారు. సరకు రవాణా రైళ్లకు సంబంధించి అన్నిరకాల నిర్వహణ పనులు వేగం వంతం చేయనున్నట్లు తెలిపారు. దీనితో జిల్లాలో అన్ని ప్రాంతాలకు సరుకు రవాణా ఇతర సదుపాయాలు కనెక్టివిటీ ఇతర ప్రాంతాలతో జిల్లా లతో సరుకు రవాణా,ప్రజాఅవసరాలు కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టు వలన ఇక్కడ గిరిజన ,నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని తెలిపారు. దీనితో జిల్లాలో హుస్సేన్ నాయక్ కు పలువురు అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు.



