వికాస్ పాఠశాలలో వింటర్ డే వేడుకలు
చలికాలపు వేషధారణతో ఆకట్టుకున్న విద్యార్థులు
స్నోమాన్, పోలార్ బియర్‌లతో కార్నివాల్ సందడి
చలికాలంలో ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన
వాతావరణ మార్పులకు సిద్ధం చేయడమే లక్ష్యం
కాకతీయ, తొర్రూరు: డివిజన్ కేంద్రంలోని వికాస్ పాఠశాలలో శుక్రవారం వింటర్ డే వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చలికాలపు ప్రత్యేక దుస్తులు ధరించి స్నోమాన్, పోలార్ బియర్, స్నో క్రిస్టల్స్ రూపాల్లో అలరించారు. పాఠశాల ప్రాంగణం కార్నివాల్ వాతావరణాన్ని తలపించింది. విద్యార్థులు రకరకాల ఆకృతులను ప్రదర్శించగా, ఉపాధ్యాయులు చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ కాలంలో వచ్చే సాధారణ వ్యాధులు, వాటికి అవసరమైన చిన్నచిన్న ఇంటి చిట్కాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహంతో పాటు ఆరోగ్యంపై చైతన్యం కలిగించింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ మాట్లాడుతూ, కాలానుగుణంగా వచ్చే వాతావరణ మార్పులను విద్యార్థులు సులభంగా ఎదుర్కొనేలా చేయడం, ప్రకృతి మార్పులపై అవగాహన కల్పించడమే వింటర్ డే కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కె.వి. రెడ్డి, ప్రిన్సిపల్స్ వేణుమాధవ్, నాగరాజు, వైస్ ప్రిన్సిపల్ రాజు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.


