epaper
Sunday, March 1, 2026
epaper

ఒట్టేయుండ్రి ఓటేశిండ్రా..

ఒట్టేయుండ్రి ఓటేశిండ్రా..

లేక‌పోతే నా పైస‌లు నాకివ్వండి

న‌ల్గొండ జిల్లాలో దేవుడి ఫొటోతో ఇంటింటికీ తిరుగుతున్న ఓడిన అభ్యర్థి

మహ‌బూబాబాద్ జిల్లాలోనూ సేమ్ సీన్‌

ఎన్నికల ఫలితాల అనంతరం పలు గ్రామాల్లో చిత్రవిచిత్రాలు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం పలు గ్రామాల్లో చిత్రవిచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల్లో గెలుస్తామనే ఆశతో.. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కొందరు అభ్యర్థులు మాత్రం ఓడిపోయారు. దీంతో ఓటమిపాలైన అభ్యర్థులు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి. చివరకు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులను తమకు తిరిగి ఇచ్చేయాలంటూ ప్రాధేయపడుతున్నారు. నల్లగొండ జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోగా.. దేవుడి ఫోటోతో ఇంటింటికీ తిరుగుతూ తన డబ్బులు ఇవ్వాలని కోరుతున్నాడు. నార్కట్​పల్లి మండలం ఔరవాణిలో బీఆర్​ఎస్​ మద్దతుదారుడు బాలరాజు మొదటి విడత ఎన్నికల్లో ఓట్ల కోసం రూ.10 లక్షలకుపైగా ఖర్చు చేశాడు. తీరా ఫలితాల్లో 448 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి దేవుడి ఫొటో, పురుగుమందుల డబ్బు చేత పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అభ్యర్థించారు. డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఓట్లు వేశామని చెబుతుండటంతో అయితే ఎలా ఓడిపోయాను అంటూ ఓటర్లను నిలదీశాడు. దేవుడిపై ప్రమాణం చేసి ఓటు వేశారో లేదో చెప్పాలని ఓటు వేయకపోతే తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. ఔరవాణి గ్రామ పంచాయతీలో మొత్తం 1577 ఓట్లు ఉండగా, 1494 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్​ బలపర్చిన పరమేశ్​ 448 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. దీంతో ఓటమిపాలైన అభ్యర్థి బాలరాజు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు.

మహబూబాబాద్​ జిల్లాలోనూ..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి కుటుంబ సభ్యులు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మీరు మాకు ఓటు వేయకపోవడంతోనే మేము ఓడిపోయాం. మాకు ఓటు వేస్తే ఓటు వేసినట్లు ప్రమాణం చేయాలి. ఓటు వేయని పక్షంలో మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి అంటూ ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేసిన డబ్బులను తిరిగి వసూలు చేసిన ఘటన మహబూబాబాద్​ జిల్లా సోమ్లా తండాలో చోటు చేసుకుంది. ఎన్నికలకు ముందు రోజు తండాలోని ఓటర్లకు ఓటుకు రూ.1500 చొప్పున, ఇంటికి ఒక కోడిని కాంగ్రెస్​ మద్దతుదారు పంచారు. కాంగ్రెస్​ రెబల్​ రూ.2000 పంపిణీ చేశారు. ఎన్నికల్లో 17 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్​ రెబల్​ అభ్యర్థి ఇస్లావత్​ సుజాత బాలాజీ గెలుపొందారు. ఓడిపోయిన కాంగ్రెస్​ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా కౌసల్య, భర్త ధల్​ సింగ్​, కుమారుడు సందీప్​ జెండా పట్టుకొని ఇంటింటికీ తిరుగుతూ మీరు ఓటు వేయకపోవడం వల్లనే మేం ఓడిపోయాం. మాకు ఓటు వేసినట్లు కులదైవం జెండా పట్టుకొని ప్రమాణం చేయండి. ప్రమాణం చేయని పక్షంలో మేం పంపిణీ చేసిన డబ్బులు మాకు ఇవ్వండి అంటూ తిరిగి డబ్బులు వసూలు చేశారు. ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అక్కడి నుంచి అందరినీ చెదరగొట్టడం గ‌మ‌నార్హం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img