epaper
Friday, November 14, 2025
epaper

ఓటు వేయకపోతే పథకాలు ఆపుతారా?

ఓటు వేయకపోతే పథకాలు ఆపుతారా?

ఎగిరెగిరిపడితే ప్రజలు వాత పెడ్త‌రు

నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉంది

రేవంత్ రెడ్డి ధమ్కీలు తెలంగాణ‌లో న‌డ‌వ‌య్‌

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో బీఆర్ఎస్‌ను గెలిపించండి

గోపన్నపై అభిమానాన్ని మరోసారి చాటిచెప్పాలి

రహమత్‌నగర్‌లో కేటీఆర్‌ రోడ్‌ షో

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ధమ్కీలు ఇస్తున్నాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రద్దు చేస్తానని ఎగిరెగిరిపడితే ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఇది చైతన్యవంతమైన తెలంగాణ అని తెలిపారు. రేవంత్‌ రెడ్డిలాంటి వాళ్లను గతంలో చాలామందిని చూశామని అన్నారు. జూబ్లీహిల్స్‌ రహమత్‌నగర్‌లో కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌ ప్రజలంటే మాగంటి గోపీనాథ్‌ (గోపన్న)కు ఎంతో అభిమానం ఉండేదని అన్నారు. జూబ్లీహిల్స్‌ ప్రజలకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని తెలిపారు. గోపన్నపై అభిమానాన్ని మరోసారి జూబ్లీహిల్స్‌ ప్రజలు చాటిచెప్పాలని కోరారు. ప్రతిభానగర్‌ నుంచి రెహమత్‌ నగర్ వరకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. 2023లో అత్యధిక మెజార్టీ ఇచ్చింది రెహమత్‌ నగరే అని గుర్తుచేశారు. ఈసారి 12వేల మెజార్టీ రెహమత్‌ నగర్‌ నుంచి వస్తుందని అనిపిస్తోందని తెలిపారు. గోపన్న నిరుపేదల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. కోట్ల రూపాయలతో వాటర్‌ ట్యాంకులు కట్టి నీటి సమస్యను తరిమికొట్టామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని అన్ని వర్గాలకు అందించిన నేత గోపీనాథ్‌ అని అన్నారు.

గోపీనాథ్‌ అకాల మరణం తీరని లోటు

గోపీనాథ్‌ అకాల మరణం తీరని లోటు అని కేటీఆర్‌ అన్నారు. భర్త చనిపోయిన మాగంటి సునీతమ్మ ఏడిస్తే ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు. ఒక్క ఆడబిడ్డను ఓడించేందుకు రేవంత్ రెడ్డి కాలికిబలపం కట్టుకుని తిరుగుతున్నాడని అన్నారు. రెండేండ్ల రేవంత్‌ రెడ్డి ఒక్క మంచి పని చేశాడా అని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో గుర్తుకు తెచ్చుకోండని అన్నారు. జూబ్లీహిల్స్‌ ప్రజలు పెట్టే వాతలకు రేవంత్‌ రెడ్డికి బుద్ధి రావాలని అన్నారు. మహామహులకు బుద్ధి చెప్పిన ఘనత తెలంగాణ గడ్డదని వ్యాఖ్యానించారు.

అడ్డగోలు హామీలిచ్చి మోసం

అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను పచ్చి మోసం చేశారని సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ మండిపడ్డారు. పథకాలను రద్దు చేస్తానని రేవంత్‌ రెడ్డి బెదిరిస్తున్నాడని విమర్శించారు. అసలేం పథకం ప్రారంభించావ్‌ రేవంత్‌ రెడ్డి అని నిలదీశారు. కేసీఆర్‌ అమలు చేసిన పథకాలను రేవంత్ రెడ్డి రద్దు చేసిండని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి అమలు చేసిన ఏ పథకం చూసి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా అని అడిగారు. స్పెషల్‌ ఉర్దూ డీఎస్పీ నిర్వహిస్తామన్నాడు ఏమైందన్నారు. కేవలం ఐదేళ్ల కోసమే రేవంత్‌ రెడ్డిని గెలిపించారని చెప్పారు. సరిగ్గా పాలించకపోతే బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారని అన్నారు. కేవలం 500 రోజుల సమయమే ఉందని తెలిపారు. 500 రోజుల తర్వాత బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాబోతుందని, కేసీఆర్‌ తిరిగి సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ హిల్స్‌లో బ్రహ్మాండమైన స్టేడియం కట్టి మాగంటి గోపీనాథ్‌ పేరు పెడతామని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉద్రిక్తత కాకతీయ, హుజురాబాద్:...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..!

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..! జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి.. కాక‌తీయ‌, హైదరాబాద్ : జూబ్లీహిల్స్...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కాంగ్రెస్‌తోనే హైద‌రాబాద్ అభివృద్ధి

కాంగ్రెస్‌తోనే హైద‌రాబాద్ అభివృద్ధి ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్టు, మెట్రోను తీసుకొచ్చాం రాజ‌ధాని మునిగిపోతే కేంద్రం చిల్లిగవ్వ...

తెలంగాణ నీ అయ్య జాగీరా ?

తెలంగాణ నీ అయ్య జాగీరా ? రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టింది అందుకే...

గోపీనాథ్ ఆస్తులపై సీఎం.. కేటీఆర్ మధ్య గొడవలు

గోపీనాథ్ ఆస్తులపై సీఎం.. కేటీఆర్ మధ్య గొడవలు ఆస్తి పంపకాల్లో ఇద్దరి మధ్య...

సొంత చెల్లెని ఇంటి నుంచి పంపిన‌వ్‌..

ఆస్తిలో వాటా కోసం సొంత చెల్లెని ఇంటి నుంచి పంపిన‌వ్‌.. మాగంటి సునీతమ్మను మంచిగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img