2028 కి పుష్ప 3 రెడీ ?
కాకతీయ, సినిమా డెస్క్: పుష్ప పుష్ప రాజ్ అంటూ పాన్ ఇండియా బాక్సాఫీస్ లెక్కలు సెట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బన్నీకి నేషనల్ వైడ్ భారీ ఫాలోయింగ్ వచ్చేలా చేసింది. పుష్ప 1 అండ్ 2 సినిమాలతో అల్లు అర్జున్ మాస్ స్టామినా ప్రూవ్ అయ్యింది. పార్ట్ 2తో కథ ముగిస్తాడని అనుకోగా సుకుమార్ ఈ సినిమాను మూడో పార్ట్ కూడా ప్లాన్ చేశాడు. పుష్ప 3 రాంపేజ్ అనే పోస్టర్ వేసి సర్ ప్రైజ్ చేశాడు. పుష్ప 3 సినిమా పనులు ఆల్రెడీ సుకుమార్ మొదలు పెట్టాడని అంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ సినిమాగా లోకేష్ తో ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఐతే అట్లీ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉండగా లోకేష్ సినిమాతో పాటు పుష్ప 3 కూడా చేస్తాడని తెలుస్తుంది. సుకుమార్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాడట. పుష్ప 2 చివర్లో తన ఫ్యామిలీని మొత్తం బ్లాస్ట్ చేయగా అల్లు అర్జున్ అడవుల్లోకి వెళ్తాడు. పార్ట్ 3 కథ ఎక్కువ భాగం ఫారెస్ట్ లోనే ఉంటుందట. ఆ తర్వాత మళ్లీ తన సామ్రాజ్యాన్ని ఎలా దక్కించుకున్నాడు అన్నదే పుష్ప 3 కథ అని తెలుస్తున్నది.



