రామ్‌చరణ్ ‘పెద్ది’ డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కే?
భారీ డీల్‌తో ఓటీటీ రైట్స్ దక్కినట్లు ప్రచారం
మార్చి 27న పాన్ ఇండియా గ్రాండ్ రిలీజ్
కాకతీయ, సినిమా : బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న భారీ రూరల్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’ షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పాన్ ఇండియా సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మార్చి 27, 2026న దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో జగపతి బాబు ‘అప్పలసూరి’ పాత్రలో కనిపించనుండగా, ఆయన లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే బోమన్ ఇరానీ, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో రూపొందుతున్న ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.


