కాకతీయ, నెల్లికుదురు: నెల్లికుదురు మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయంతో విద్యార్థులు, మేధావులు, పాఠకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎప్పుడు కూలిపోతుందో తెలియని భయాందోళనలో ఉన్నారని, తక్షణమే నూతన గ్రంధాలయ నిర్మాణానికి సహకరించాలని సీనియర్ జర్నలిస్ట్ బొడ్డు అశోక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు బుధవారం హైదరాబాద్ లో టీజేఎస్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నూతన నిర్మాణానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చినట్లు అశోక్ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి బైరి రమేశ్, మాల మానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, జాతీయ కార్యదర్శి అశోద భాస్కర్, జిల్లా అధ్యక్షుడు చిట్టిమల్ల మహేష్, సీనియర్ నాయకులు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.


