అక్టోబర్ 27 (కాకతీయ సినిమా): టాలీవుడ్‌లో అందం, అటిట్యూడ్ కలిగిన హీరోయిన్ అంటే తప్పక చెప్పుకోవాల్సిన పేరు అను ఇమ్మాన్యుయేల్. ఈ మలయాళ ముద్దుగుమ్మ 2016లో ` యాక్షన్ హీరో బిజు` మూవీతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇందులో సింపుల్, నేచురల్ లుక్‌తో కేరళ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అదే ఏడాది వచ్చిన నాని ` మజ్ను` అను ఇమ్మాన్యుయేల్‌కి టాలీవుడ్ లో ఒక గ్లామరస్ డెబ్యూ. కానీ అను కెరీర్ లో మజ్ను మినహా చెప్పుకోదగ్గ హిట్లు లేవు.
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య, రవితేజ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నా అను ఇమ్మాన్యుయేల్‌కు అదృష్టం కలిసి రాలేదు. వరుస పరాజయాల కారణంగా ఒక దశలో అనుపై ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడింది. చివరిగా ఈ ముద్దుగుమ్మ రవితేజ సరసన ` రావణాసుర` చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా అంగీకరించలేదు. అటు తమిళంలోనూ అదే పరిస్థితి.
అయితే రెండేళ్ల గ్యాప్ అనంతరం అను పాప ` ది గర్ల్ ఫ్రెండ్` మూవీతో బిగ్ స్క్రీన్‌పై రీఎంట్రీ ఇవ్వబోతుంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన రొమాంటిక్ డ్రామా ఇది. ఈ చిత్రంలో దీక్షిత్‌శెట్టి, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు. దుర్గ అనే బోల్డ్ క్యారెక్టర్ లో అను అలరించబోతుంది. నవంబర్ 7న ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ థియేటర్స్ లోకి రానుంది. రీసెంట్‌గా బయటకు వచ్చిన ట్రైలర్ తో అను రీఎంట్రీపై అంచనాలు పెరిగాయి. సినిమాలో అను పాత్ర కథను మలుపు తిప్పేదిగా ఉంటుందని తెలుస్తోంది. మరి గర్ల్‌ఫ్రెండ్ మూవీతో అయినా అను దశ తిరుగుతుందా? ఆమె కెరీర్ మళ్లీ పుంజుకుంటుందా? అన్నది చూడాలి.


