కాకతీయ, రామకృష్ణాపూర్ : స్థానిక తవక్కల్ పాఠశాలలో అడవులు, వన్యప్రాణుల అంశంపై చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. పోటీలలో గెలుపొందిన విజేతలను విద్యాసంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ అభినందించారు.


