- ఆలేరులో ఘటన
కాకతీయ, నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో భర్త చేతిలో భార్య హత్యకు గురైంది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల.. ప్రకారం ఆలేరు గ్రామానికి చెందిన చీకటి నరేష్ పెద్ద కుమారుడు విక్రమ్ ఆయన భార్య స్వప్న అడ్డు వచ్చింది. దీంతో నీ వల్లే కొడుకు ఇలా తయారయ్యాడని భార్య స్వప్న(36)పై గొడ్డలితో కొట్టగా తల వెనుక భాగంలో తీవ్ర గాయమై రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి అక్క మాచర్ల ఉమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


