epaper
Thursday, March 26, 2026
epaper

పండగ పూట ఎందుకొచ్చినట్టు?!

పండగ పూట ఎందుకొచ్చినట్టు?!
ఏనుమాముల మార్కెట్‌కు స్టేట్‌ విజిలెన్స్ టీమ్
జాతర వేళ విచారణ సాధ్యమా?
వ్యాపారులే లేని చోట నిజాలు ఎలా తేలుతాయి..!

కాకతీయ, వరంగల్ : విజిలెన్స్ పేరు వినగానే అధికారుల్లో హడల్ మొదలవుతుంది. ఏ ప్రశ్నలు వేస్తారో, ఏ సమాధానాలు ఇవ్వాలో అన్న ఆందోళన సహజం. కానీ అలాంటి ఉత్కంఠ ఏమీ లేకుండానే గురువారం వరంగల్ ఏనుమాముల మార్కెట్‌ను విజిలెన్స్ అధికారులు సందర్శించడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర వేళ ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. రైతులు, వ్యాపారులు, కార్మికులు అందరూ వనదేవతల దర్శనానికి తరలిపోతారు. ఈ నేపథ్యంలోనే ఏనుమాముల మార్కెట్ యార్డులో నాలుగు రోజుల పాటు లావాదేవీలు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ అధికారులు ముందుగానే ప్రకటించారు. రైతులు రారని, వ్యాపారాలు సాగవని తెలిసిన పరిస్థితుల్లో విజిలెన్స్ అధికారులు మార్కెట్‌కు రావడం ఆశ్చర్యంగా మారింది.

మార్కెట్ బోసిపోయిన వేళ

విజిలెన్స్ బృందం మార్కెట్‌కు చేరుకున్న సమయానికి అధికారులు మినహా అక్కడ ఒక్క రైతు కూడా లేడు. అడ్డీలు, కమిషన్ ఏజెంట్లు, కూలీలు ఎవ్వరూ కనిపించలేదు. సాధారణంగా రద్దీగా ఉండే ఏనుమాముల మార్కెట్ పండగ వేళ పూర్తిగా బోసిపోయి దర్శనమిచ్చింది. షాపులన్నీ మూసి ఉండగా, లావాదేవీల ఆనవాళ్లే కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విజిలెన్స్ విచారణ ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైతులు లేకుండా, వ్యాపారులు లేకుండా, కమిషన్ ఏజెంట్లు లేకుండా ఏ అంశంపై విచారణ చేయాలన్న సందేహం వ్యక్తమవుతోంది. అసలు మార్కెట్‌లో అక్రమాలు, అవకతవకలపై సమాచారం సేకరించాలంటే సంబంధిత వర్గాలు అక్కడ ఉండాల్సిందే కదా అన్న వాదన వినిపిస్తోంది.

జాతర సంగతి తెలియదా?

మేడారం జాతర రాష్ట్రపండుగ స్థాయిలో జరుగుతుందన్న విషయం అధికారులకు తెలియదా? జాతర వేళ మార్కెట్లు మూసి ఉంటాయన్న సమాచారం విజిలెన్స్ విభాగానికి అందలేదా? లేక జాతర కోసం వెళ్తూ, వెళ్తూ ఇటువైపు కూడా వచ్చారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కొందరు అయితే ‘‘విచారణ కోసం వచ్చారా? లేక వచ్చామని చూపించుకోవడానికే వచ్చారా?’’ అంటూ ప్రశ్నిస్తున్నారు. విజిలెన్స్ అధికారుల పర్యటనపై మార్కెట్ అధికారులను సంప్రదించగా, వారు ఎలాంటి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఏ అంశంపై విజిలెన్స్ బృందం వచ్చిందన్నది కూడా చెప్పకపోవడం మరింత చర్చకు దారితీసింది. ఇక విజిలెన్స్ అధికారులు మూసివేసిన షాపుల ముందు ఫొటోలు దిగడం, ఖాళీ మార్కెట్‌ను పరిశీలించినట్లు చూపించుకోవడం పండగపూట ఆటవిడుపులా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాపారులే లేని చోట విచారణలు, తనిఖీలు ఎంతవరకు ఫలితాన్నిస్తాయో అన్న సందేహాలు ఇప్పటికీ తీరడం లేదు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దుగ్గొండి తహసీల్దార్‌గా ముస్కు సమ్మక్క బాధ్యతల స్వీకరణ

దుగ్గొండి తహసీల్దార్‌గా ముస్కు సమ్మక్క బాధ్యతల స్వీకరణ.. కాకతీయ, వరంగల్ బ్యూరో (...

కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలుగా ఐతం స్వరూప

కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలుగా ఐతం స్వరూప కాకతీయ, ఖిలావరంగల్: కాపు...

పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదు

పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదు రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే...

సోలార్‌తో ఆదాయం ఆదా

సోలార్‌తో ఆదాయం ఆదా సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ డాక్టర్ సత్య...

విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించాలి

విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించాలి దిశా కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబురావు అన్నం ఉడ‌క‌లేద‌ని,...

రోగులకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం

రోగులకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ స‌త్య శార‌ద‌ కాకతీయ,...

ఘ‌నంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

ఘ‌నంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కాకతీయ, నూగూరు వెంకటాపురం : మండల కేంద్రంలో...

శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ

శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ కాకతీయ, రాయపర్తి : మండలంలోని ఆరేగూడెం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img