ఎవరు గెలిచినా.. చరిత్రే..!
మరి కొద్దిసేపట్లో మహిళల వన్ డే మ్యాచ్ ప్రపంచకప్ ఆరంభం
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తుది పోరు
మూడోసారి పైనల్ ఆడుతున్న భారత్
తొలిసారి ఫైనల్‌లో తలబడుతున్న దక్షిణాఫ్రికా
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : ఐసీసీ వుమెన్స్ వన్ డే మ్యాచ్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభకానుంది.ఈ చారిత్రాత్మక ఫైనల్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. డాక్టర్ DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ, నవీ ముంబైలో ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 3:00 గంటలకు (IST) మ్యాచ్ ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 2:30 గంటలకు ఉంటుంది.
ఆస్ట్రేలియా లేదా ఇంగ్లండ్ లేకుండా జరుగుతున్న తొలి మహిళల ప్రపంచ కప్ ఫైనల్ ఇది. ఈ రెండు జట్లు (భారత్, దక్షిణాఫ్రికా) కూడా ఇప్పటివరకు మహిళల ప్రపంచ కప్ టైటిల్‌ను గెలవలేదు, కాబట్టి ఈసారి కొత్త ఛాంపియన్ అవతరించనుంది. ఈ కీలకమైన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, రిజర్వ్ డే అందుబాటులో ఉంది. రిజర్వ్ డే కూడా రద్దైతే, పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా విజేతగా నిలుస్తుంది. భారత జట్టు తమ తొలి ప్రపంచ కప్ టైటిల్ కోసం పట్టుదలతో ఉంది, ఇది వారికి భారత జట్టు మూడుసార్లు ఫైనల్కు రాగా నిరాశ ఎదురైంది. దక్షిణాఫ్రికా జట్టు మాత్రం ఇదే తొలిసారి ఫైనల్‌కు రావడం. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో, మరియు ఆన్‌లైన్‌లో డిస్నీ+హాట్‌స్టార్ (Disney+Hotstar)లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది.


