- విజయ్ కు అందని ఆసరా పెన్షన్
- వెంటనే పింఛన్ ఇచ్చి ఆదుకోవాలంటున్న స్థానికులు
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : ఎవరూ లేని అనాథకు మూడు నెలల నుండి పింఛన్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. మహబూబాబాద్ మున్సిపాలిటీ ఆరో వార్డ్ పరిధిలోని బేతోలు గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన జినక విజయ్ పుట్టకతోనే పోలియోతో ఇబ్బంది పడుతున్నాడు. పోస్ట్ ఆఫీస్ లో గత 11 సంవత్సరాల నుండి సదరం సర్టిఫికెట్ ద్వారా పింఛన్ పొందుతున్నాడు.
బాధితునికి మూడు నెలలుగా ఆసరా పింఛన్ అందకపోవడంతో అతడు బంధువుల దగ్గర ఉంటున్నాడు. విజయ్ బాబాయ్ ఎల్లయ్య పింఛన్ ఎందుకు నిలిపివేశారని అధికారులను తెలుసుకోగా, బాధితుడి ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేట్ లింక్ చేయకపోవడంతో ఆసరా పింఛన్ నిలిపివేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి తల్లిదండ్రులు లేని అనాథలు, వృద్దులకు ఎటువంటి షరతు లేకుండా పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని పలువురు ఆసరా పెన్షన్ దారులు, వికలాంగులు కోరుతున్నారు .


