epaper
Monday, March 2, 2026
epaper

ములుగు మున్సిపల్ పీఠం ఎవ‌రికి..?

ములుగు మున్సిపల్ పీఠం ఎవ‌రికి..?
కాంగ్రెస్‌లో నలుగురు మహిళా కౌన్సిలర్ల మధ్య పోటీ
బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో పెరిగిన‌ ఆసక్తి
చైర్మన్ పీఠానికి ఆశావహుల లాబీయింగ్ ముమ్మరం
మంత్రి సీతక్క నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఈ నెల 16న జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ పీఠం కోసం పోటీ తీవ్రంగా మారింది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్‌కు చెందిన నలుగురు మహిళా కౌన్సిలర్లు పీఠం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నాలుగో వార్డు నుంచి గెలిచిన గుంటోజు పావని నిరంజన్ చారి, మూడో వార్డు నుంచి గెలిచిన యాసం వసంత రవికుమార్, ఆరో వార్డు నుంచి గెలిచిన చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి, ఎనిమిదో వార్డు నుంచి గెలిచిన నల్లెల్ల స్వాతి భరత్ కుమార్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. మొత్తం 20 వార్డుల్లో కాంగ్రెస్ 12 స్థానాలు గెలుచుకోగా, టీఆర్ఎస్ 5, స్వతంత్రులు 2, బీజేపీ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి.

చైర్మన్ పీఠం కోసం లాబీయింగ్ ముమ్మరం
చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు తమ తమ వర్గాల మద్దతుతో మంత్రి సీతక్కను కలుస్తూ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నల్లెల్ల స్వాతి భరత్ కుమార్ కుటుంబానికి ప్రాంతీయంగా రాజకీయ ప్రాధాన్యం ఉండగా, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీగా పనిచేసిన వారి కుటుంబానికి పదవి ఇవ్వాలని అనుచరులు కోరుతున్నట్లు తెలిసింది. అలాగే స్వాతంత్ర్య సమరయోధుడు గుంటోజు నరసయ్య కుటుంబానికి చెందిన గుంటోజు పావని నిరంజన్ చారి కుటుంబ సభ్యులు కూడా చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మంత్రి సీతక్కతో దీర్ఘకాల రాజకీయ అనుబంధం కలిగిన యాసం వసంత రవికుమార్ కుటుంబం కూడా చైర్మన్ పీఠం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. మరోవైపు మంత్రి సీతక్కకు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన నాయకుడు బిక్షపతి తన సతీమణి చంద్రకళకు చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మంత్రి నిర్ణయంపై ఆసక్తి
చైర్మన్ ఎన్నికకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లను క్యాంపులో ఉంచినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని అనుసరించి చైర్మన్ ఎంపిక జరగనున్నట్లు తెలుస్తోంది. నలుగురు మహిళా కౌన్సిలర్ల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా మారడంతో మంత్రి సీతక్క ఎవరికి అవకాశం కల్పిస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సోమవారం జరగనున్న చైర్మన్ ఎన్నిక ఫలితంపై జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ములుగు మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది రాజకీయంగా కీలకంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img