బిసి రిజర్వేషన్ ల కోసం ఎవరిపై పోరాటం
గిర్నిబావిలో విచిత్ర పరిస్థితి
అన్ని పార్టీలు రోడ్డుపై భైఠయింపు
రాజకీయ పార్టీల ఆసిత్వం కోసం పోరాటం
అయోమయంలో ప్రజానీకం
కాకతీయ, దుగ్గొండి: బిసి రిజర్వేషన్ ల అమలుకై శనివారం బంద్ ప్రకటించిన నేపథ్యంలో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నీబావి వద్ద విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ పార్టీలు పోటీగా నినాదాలు చేస్తూ ప్రధాన రహదారిపై బైటయించారు.
అసలు ధర్నా ఎవరికోసం ఎపార్టీ వాళ్ళు చేస్తున్నారు. అన్ని పార్టీలలో ఉన్న బిసి ల కోసం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ ఆస్థిత్వాన్ని కాపాడుకోవడని ధర్నాలు చేస్తున్నారని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. మండల వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా సాగుతుంది. వరంగల్ – నర్సంపేట ప్రధాన రహదారిపై రాజకీయ పార్టీల ధర్నాతో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా దుగ్గొండి ఎస్సై రణధీర్ సిబ్బందితో చొరవ చూపారు.



