కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంపై ఈమధ్య కాలంలో వార్తలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో మిస్సింగ్ వార్తలు జోరందుకున్నాయి. ఇటీవల ట్రంప్ మీడియా ముందు కనిపించలేదు. ఏదైనా చెప్పాలనుకున్నా ట్రూత్ ద్వారానే వెల్లడిస్తున్నారు. వారాంతమైన ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్ హౌస్ షెడ్యూల్ లోనూ కనిపించకపోవడంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.
ట్రంప్ హెల్త్ పై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 24 గంటలుగా ట్రంప్ కనిపించడంలేదు. మరో రెండు రోజులు ఎలాంటి పబ్లిక్ మీటింగ్స్ లేవు. అసలు ఏం జరుగుతోంది అంటూ ఓ వ్యక్తి ఎక్స్ లో పోస్టు చేశారు. మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని ఆయన ట్రూత్ సోషల్ పోస్టులు చెబుతున్నాయని మరికొందరు అంటున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్ లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదన్న కారణాలు కూడా వినిపిస్తున్నాయి.
79ఏండ్ల ట్రంప్ అనారోగ్యంపై తరచూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల ట్రంప్ చేతిపై గాయంతో కనిపించారు. గతంలోనూ ఈ గాయాన్ని దాచేందుకు ఆయన చేతికి మేకప్ వేసుకుని కనిపించారు. దీనిపై ట్రంప్ వైద్యుడు సీన్ బార్బబెల్లా స్పందించారు. ఆ గాయం నిజమేనని అంగీకరించారు. తరచుగా కరచాలనం చేయడం వల్లే ఆస్ప్రిన్ వాడటం వల్ల ఇలా జరిగిందని తెలిపారు. అయితే ట్రంప్ పూర్తి అనారోగ్యంగానే ఉన్నట్లు ఆయన తెలిపారు.


