మానవత్వం పరిమళించిన వేళ
10వ తరగతి స్నేహితుల మానవీయ స్పందన
హరిలాల్ కుటుంబానికి ఆర్థిక సహాయం
కాకతీయ, కొత్తగూడెం : స్నేహం అంటే కష్టసమయంలో అండగా నిలబడటమే అని 10వ తరగతి స్నేహితులు నిరూపించారు. హరిలాల్ కుటుంబానికి సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటారు. ఫిబ్రవరి 11 2026న హరిలాల్ అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ పరిస్థితిలో ఆయనతో కలిసి చదివిన 2003-04 ఆశ్రమ పాఠశాల రేగళ్ల స్నేహితులు ముందుకు వచ్చారు. స్నేహితులంతా కలిసి ఆదివారం హరిలాల్ కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగీలాల్ నాయక్, అజ్మీరా శివ, గుగులోత్ లాల్ షింగ్, భూక్యా నరసింహ, చిలకమారి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హరిలాల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరిలాల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. స్నేహం విలువను మరోసారి గుర్తు చేశారు.


