epaper
Tuesday, April 7, 2026
epaper

రాసింది కరెక్టే.. రాయకుంటే బాగుండు !

రాసింది కరెక్టే.. రాయకుంటే బాగుండు !
ఇదీ ఆయుర్వేద వైద్య క‌ళాశాల అధికారుల‌ తీరు
‘కాకతీయ’ కథనంపై భినాభిప్రాయాలు
రాజకీయ, విద్యార్థి నాయకులతో బెదిరింపు ధోరణిలో ఫోన్‌ కాల్స్
కళాశాల పరిస్థితులపై వరంగల్ కలెక్టర్ ఆరా !
అన్ని సక్రమంగానే ఉన్నట్లు విద్యార్థులతో బలవంతంగా సంతకాల సేకరణ
ఆ భయంతోనే అసౌకర్యాలపై ఇంతకాలం ప్రశ్నించలేకపోయిన విద్యార్థులు
ఫెయిల్ చేస్తారనే ఆందోళనతో అరకొర వసతుల నడుమే కాలం వెళ్లదీత

కాకతీయ, వరంగల్ : ‘తిట్టను పోరా.. మల్లిగా’ అన్నట్లు ఉంది వరంగల్ ఆయుర్వేద వైద్య కళాశాల తీరుపై పలువురి వాదన. కాలేజీలో అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయనే కథనంపై అధ్యాపకులు, విద్యార్థులు తలోరకంగా చర్చించుకోవడం ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ప్రజా సమస్యలు, విద్యార్థుల అవస్థలపై పోరాటం చేయగలిగే పార్టీలు సైతం.. కథనం పట్ల స్పందించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. జాతకం అంతా బాగానే ఉంది.. శనిగ్రహం వక్రంగా చూస్తున్నాదని అయ్యగార్లు చెప్పినట్లుగా ఒక్కొక్కరి వాదన అయోమయానికి గురి చేస్తోంది.

అస‌లేం జరిగిందంటే!

వరంగల్ నగరంలో లేబర్ కాలనీ ఏరియాలో అనంతలక్ష్మి పేరిట ఆయుర్వేద వైద్య కళాశాల నలభై ఏళ్ల నుంచి కొనసాగుతోంది. దాతలు ఇచ్చిన స్థలంలో నాలుగైదు భవనాల్లో తరగతులు, ఆఫీసు కార్యకలాపాలు సాగుతున్నాయి. అయితే, ఆ భవనాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరినట్లు కళ్లకు కడుతున్నాయి. ఒక భవనం కొత్తగా నిర్మించినా నిర్వహణ లోపంతో అధ్వానంగా తయారైంది. ఇక హాస్టల్లో పరిస్థితులు దారుణంగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. రెండు ఫ్లోర్లుగా ఉన్న హాస్టల్ కింది భాగంలో వంట గది తీరు దారుణంగా ఉంది. విద్యార్థులకు తాగునీటి వసతి కూడా అంతంతమాత్రమే. వంటగది పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఇక కరెంట్ పోతే.. కింది పోర్షన్ లో చీకట్లు అలుముకునే పరిస్థితులు కనిపించాయి. మరో భవనం ముందు ఏర్పాటు చేసిన పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. అదే భవనం పైకప్పు పెచ్చులూడిపోయాయి. కాలేజీ ఆవరణ మొత్తం చెత్తాచెదారంతో నిండి ఉంది. ఇవే పరిస్థితులను ‘కాకతీయ’ దినపత్రిక ఫొటోలతో సహా ముద్రించింది. అలాగే, కాలేజీ, హాస్టల్ నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని ప్రచురించింది. అందుకు నిధులు లేకపోవడమే కారణమని వెల్లడించింది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది.

రాసింది కరెక్టే కానీ!

దాతల సహకారం ఉంటే గానీ అనంతలక్ష్మి ఆయుర్వేద కాలేజీ మెరుగుపడేలా లేదని కాకతీయ దినపత్రిక వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నం చేసింది. అయితే, దీనిపై కొందరు వివిధ రకాలుగా స్పందించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొందరు కాకతీయ దినపత్రిక ప్రతినిధికి ఫోన్ చేసి.. తమ అభిప్రాయాలను వెల్లడించడం గమనార్హం. రాసింది 90 శాతం కరెక్టే గానీ, అధ్యాపకులు ఆ కాలేజీకి పలు రకాలు సేవలు అందిస్తున్నారని పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని ఒక పక్క అధ్యాపకులే చెబుతున్నారు. మళ్లీ అధ్యాపకులే సేవ చేస్తున్నారని ఓ రాజకీయ నాయకుడు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ అధ్యాపకులు కాలేజీ కోసం సేవలు అందిస్తున్నా.. ఆర్థిక అవసరాలకు వారి జేబులో నుంచి పెడుతున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకపక్క విద్యార్థుల నుంచి హాస్టల్ మెయింటనెన్స్ కోసం అడ్మిషన్ల సమయంలో ఏటా 16 వేలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో నుంచి హాస్టల్ కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నామని, ఇతర మైనర్ రిపేర్లు చేయిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇక ఇతరత్రా నిర్వహణకు దాతలు ముందుకొస్తే గానీ, పనులు సాగేలా లేవనేది స్పష్టమవుతోంది. ఈ క్రమంలో అధ్యాపకులు సేవలు చేస్తున్నారంటే.. సందేహాలు కలుగుతున్నాయి.

కలెక్టర్ ఆదేశాలతో సంతకాల సేకరణ!

ఇదిలా ఉండగా, కాకతీయ దినపత్రిక కథనాలతో కలెక్టర్ స్పందించినట్లు తెలిసింది. ఆయుర్వేద వైద్య కళాశాల స్థితిగతులపై కలెక్టర్ ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, అధ్యాపకులు వాస్తవ పరిస్థితులను కలెక్టర్‌కు నివేదించకుండా అన్ని బాగానే ఉన్నట్లు లేఖ తయారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆ లేఖ మీద విద్యార్థులతో బలవంతంగా సంతకాలు సేకరించినట్లు తెలుస్తోంది. నిజానికి కలెక్టర్ ఈ కథనంపై స్పందించి ఉంటే.. జిల్లా అధికారిగా నగరంలోనే ఉన్న ఆ కళాశాలను సందర్శించే వారు. అలా కాకుండా కలెక్టర్ కాలేజీ అధ్యాపకులపై సీరియస్ కావడంతో వారు పరిస్థితులను దాచిపెట్టి.. అన్ని సవ్యంగానే ఉన్నట్లు లేఖ సిద్ధం చేయడం ఆయుర్వేద వైద్య విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. భవనం శిథిలావస్థకు చేరుకుంది నిజం కాదా? రేకుల షెడ్డు ధ్వంసమైంది అబద్ధమా? హాస్టల్లో మట్టికుప్ప వాస్తవం కాదా? కరెంట్ పోతే చీకట్లు నెలకొనే దుస్థితి లేదా? కొత్త బిల్డింగ్ అపరిశుభ్ర వాతావరణం ఉన్నది అవాస్తవమా? విద్యార్థులకు స్కాలర్షిప్ లు పెండింగ్ ఉన్నది నిజం కాదా? కాలేజీలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నది అబద్ధమా? ఇన్ని సమ్యలుంటే… అన్ని సవ్యంగానే ఉన్నాయని అధ్యాపకులు లేఖ రాయడం, ఆపై విద్యార్థులతో సంతకాలు సేకరించడం వెనుక ఆంతర్యమేమిటో జిల్లా యంత్రాంగమే వెల్లడించాలి. లేదంటే ఎంజీఎం ఆస్పత్రి ఎదుర్కొంటున్న పరిస్థితులే.. ఆయుర్వేద వైద్య విద్య కాలేజీకి పట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా అధ్యాపకులు వాస్తవ పరిస్థితులను కలెక్టర్ కు నివేదించాలి. అవసరమైతే కలెక్టర్ స్వయంగా కాలేజీని సందర్శించి… విద్యార్థులతో అధ్యాపకులు లేకుండా చర్చించి, నిజానిజాలను ప్రభుత్వానికి నివేదించాల్సి అవసరం ఉంది

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇంటర్న్ షిప్ విద్యార్థులకు ఉపయోగకరం

ఇంటర్న్ షిప్ విద్యార్థులకు ఉపయోగకరం ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు కాకతీయ, నెల్లికుదురు : ఇంటర్న్...

అమ్మ.. నాయినో!

అమ్మ.. నాయినో! ఎంజీఎంపై ఎంత కాలానికి స్పందన ? ఆస్పత్రిని సందర్శించిన పశ్చిమ ఎమ్మెల్యే...

25వ వార్డులో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

25వ వార్డులో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీలక్ష్మీ రామానంద్ కాకతీయ,నర్సంపేట టౌన్...

కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా అశోక్ గౌడ్

కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా అశోక్ గౌడ్ కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారం గ్రామానికి...

ఆహార భద్రతలో రాజీ పడొద్దు

ఆహార భద్రతలో రాజీ పడొద్దు నాణ్యమైన ఆహారంతోనే మెరుగైన ఆరోగ్యం గడువు తేదీలు తప్పనిసరిగా...

వేయి స్తంభాల ఆల‌య అభివృద్ధికి 14.44 కోట్లు మంజూరు

వేయి స్తంభాల ఆల‌య అభివృద్ధికి 14.44 కోట్లు మంజూరు కేంద్రం నిధులతో పునరుద్ధరణ...

అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు

అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు శంకుస్థాపన జరిగి రెండేళ్లైనా పనులు లేవు బీజేపీ...

రైతు లేనిదే రాజ్యం లేదు

రైతు లేనిదే రాజ్యం లేదు ప్రతి గింజకు ప్ర‌భుత్వం మద్దతు ధర రైతులు మధ్యవర్తులను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img