epaper
Wednesday, April 1, 2026
epaper

సీఐడీ ఎంక్వైరీతో లాభ‌మేంటి?

సీఐడీ ఎంక్వైరీతో లాభ‌మేంటి?

మంత్రిని అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంటుందా?

పొంగులేటి మంత్రి పదవికి రాజీనామా చేయాలి

క‌డియం శ్రీహ‌రిని ప్ర‌శ్నించ‌డ‌మే త‌ప్పా?

ప్రజల పక్షాన నిలబడినందుకే టార్గెట్

ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం పోరాటం ఆపం

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

శ్రీహరి వంటి నాయకుడి మీరు వెనుకేసుకొస్తారా ?

కోరుట్ల ఎమ్మెల్యే కల్వంకుట్ల సంజయ్

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరిగే మైనింగ్ స్కామ్‌ను హరీశ్‌రావు అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెట్టారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. మైనింగ్ స్కామ్ మీద హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశామని పేర్కొన్నారు. హౌస్ కమిటీ వేయడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఏం సమస్య అని ప్రశ్నించారు. హైదరాబాద్‌‌‌లోని తెలంగాణ భవన్‌లో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై సీఐడీ ఎంక్వైరీ వేస్తామని ప్రభుత్వం చెబుతోందని.. మంత్రి మీద సీఐడీ ఎంక్వైరీ వేస్తే న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. మంత్రిని సీఐడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంటుందా అని పాడి కౌశిక్ రెడ్డి అడిగారు. అందుకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశామని తెలిపారు. అయితే దానం నాగేందర్.. కడియం శ్రీహరితో ముఖ్యమంత్రి మాట్లాడించారని చెప్పారు. దానం నాగేందర్ నోటికొచ్చినట్లు మాట్లాడి బెదిరించారని తెలిపారు. అన్నం పెట్టిన కేసీఆర్ గురించి కడియం శ్రీహరి తప్పుగా మాట్లాడారని పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. కడియం శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు. సిట్టింగ్‌ను కాదని కడియం శ్రీహరికి కేసీఆర్ టికెట్ ఇచ్చారని గుర్తుచేశారు. అందుకే నువ్వు ఏ పార్టీలో ఉన్నావని కడియం శ్రీహరిని అడిగామని తెలిపారు. తనతో పాటు బీఆర్ఎస్ సభ్యులందరూ అడిగారని.. ఇది తప్పా అని నిలదీశారు. కాంగ్రెస్ వాళ్ల దగ్గర ఎందుకు కూర్చున్నావని ప్రశ్నించాం.. అది తప్పా అని ప్రశ్నించారు. నువ్వు ఏ పార్టీ పక్షాన మాట్లాడుతున్నావని కడియం శ్రీహరిని అడిగామన్నారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా..

కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరూ నన్ను టార్గెట్ చేశారని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడినందుకు తనను టార్గెట్ చేశారని అన్నారు. నిరుద్యోగుల పక్షాన ఉద్యోగాలు అడిగినందుకు టార్గెట్ చేస్తున్నావా అని ప్రశ్నించారు. పెన్షన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నిస్తే టార్గెట్ చేస్తున్నావా అని నిలదీశారు. ప్రజల కోసం పోరాడుతున్నందుకే తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎథిక్స్ కమిటీకి కాంగ్రెస్ నేతల తిట్లు కనిపించవా అని ప్రశ్నించారు. దానం తిట్లు ఎథిక్స్ కమిటీకి రావా అని అడిగారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు మాట్లాడిన బూతులు అందరూ చూశారని తెలిపారు. కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌లో ఉంటే కేసీఆర్, హరీశ్‌రావును ఎందుకు విమర్శించారని ప్రశ్నించారు. హామీలపై మేం ప్రశ్నిస్తే మమ్మల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

ప్రభుత్వం స్పందించడం లేదు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అవినీతిని బయటపెడితే ప్రభుత్వం స్పందించడం లేదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వంకుట్ల సంజయ్ మండిపడ్డారు. మైనింగ్‌పై జరుగుతున్న అవినీతిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. సభాసంఘం వేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కల్వకుంట్ల సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. నిజమైన నాయకులంటే పార్టీ లైన్‌లో ఉండాలి.. కానీ పార్టీ మారిన మనిషిని మీ భుజాల మీద ఎత్తుకుంటున్నారని మండిపడ్డారు. తోటి శాసనసభ్యుడిని తిట్టేందుకు మంత్రులకు మైక్‌లు ఇచ్చారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు ఒక్కరైనా సబ్జెక్ట్ మాట్లాడారా అని ప్రశ్నించారు. స్వర్ణకారుల కష్టాల గురించి ఒక్కరైనా మాట్లాడారా అని అడిగారు. అవినీతి మంత్రిని, పార్టీ మారిన వ్యక్తిని వెనుకేసుకొచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మా వెనుకాల కూర్చోవాలి కదా అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి వంటి నాయకుడి మీరు వెనుకేసుకొస్తారా అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి ఏ పార్టీ అని మేం తప్పకుండా అడుగుతామని తెలిపారు. తొలిసారి అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు రాజ్యాంగ విలువలు కాపాడాలని సూచించారు. అసెంబ్లీలో చర్చ చూసి పిల్లలు నవ్వుకుంటున్నారని అన్నారు. సభలో పాలసీల గురించి మాట్లాడుతున్నామా? అని అడిగారు. మనం చర్చించాల్సింది ప్రజల సమస్యల గురించి మాత్రమే అని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర

లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర యువతకు ఉద్యోగాలు దక్కకుండా ప్రభుత్వం అడ్డంకులు తమవారికే కొలువులు...

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానం

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానం హ్యామ్ మోడల్ రోడ్లకు రూ. 13 వేల...

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన క‌లిగి ఉండాలి

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన క‌లిగి ఉండాలి అల్లు అర్జున్ ఫ్యాన్స్ సామాజిక సేవ...

ఆత్మీయ అనుబంధాలు మాయం

ఆత్మీయ అనుబంధాలు మాయం మనుషుల మధ్య పెరుగుతున్న వైష‌మ్యాలు ప్రేమానురాగాల కంటే సంపాదనపైనే మోజు ఉమ్మ‌డి...

వైన్స్‌లకు దేవుడి పేర్లు తీసేయండి

వైన్స్‌లకు దేవుడి పేర్లు తీసేయండి భ‌గ‌వంతుడి పేర్లు పెట్టకుండా చట్టాలు తీసుకురావాలి లైసెన్సులు ఇచ్చే...

9 లక్షల 45 వేల మందికి ఆరోగ్యశ్రీ

9 లక్షల 45 వేల మందికి ఆరోగ్యశ్రీ.. ఏడాదికి 4 లక్షల మందికి...

ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించాలి

ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించాలి బిల్లులు రాక ద‌వాఖాన‌లు మూత‌బ‌డే ప‌రిస్థితి మేజర్ సర్జరీలకు...

ఏసీబీకి పట్టుబడిన మామడ ఎస్సై

ఏసీబీకి పట్టుబడిన మామడ ఎస్సై .. రూ. 20 వేలు తీసుకుంటూ దొరికిపోయిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img