epaper
Sunday, March 1, 2026
epaper

పరకాలకు పదేళ్లలో చేసింది శూన్యం

పరకాలకు పదేళ్లలో చేసింది శూన్యం
జిల్లా కేంద్రం అవకాశాన్ని చేజేతులా చేజార్చారు
వ్యాపారాలకే పరిమితమైన అప్పటి ఎమ్మెల్యే
టీఆర్‌ఎస్ పాలనలో లాభపడింది ఒక కుటుంబమే
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయాలి
ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి పిల‌పు

కాకతీయ, పరకాల : పదేళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగిన చల్లా ధర్మారెడ్డి పరకాల పట్టణ అభివృద్ధికి ఏమాత్రం సేవ చేయలేదని, ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ బీఆర్‌ఎస్ పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలో మాజీ ఎమ్మెల్యే మొలుగురు బిక్షపతి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దొంబాటి సాంబయ్యతో కలిసి ప్రచారం నిర్వహించిన రేవూరి ప్రకాష్‌రెడ్డి, గత ప్రభుత్వ హయాంలో పరకాల ప్రజలకు జరిగిన అన్యాయాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పరకాలను జిల్లా కేంద్రంగా చేయాలనే చర్చలు తీవ్రంగా జరుగుతున్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి తన వ్యాపారాల కోసం శ్రీలంకకు వెళ్లిపోయారని ఆరోపించారు. “పరకాల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన కీలక సమయంలో ప్రజలను పట్టించుకోకుండా విదేశాలకు వెళ్లిన నాయకుడు, పట్టణాభివృద్ధికి ఏం చేస్తాడు?” అని ప్రశ్నించారు. పదేళ్ల కాలంలో పరకాలకు కొత్త ప్రాజెక్టులు తీసుకురావడంలో, మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమై ప్రజల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు.

ప్రజలు కాదు – బీఆర్‌ఎస్ కుటుంబమే బాగుపడింది

తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో సామాన్య ప్రజలు ఎవ్వరూ బాగుపడలేదని, ఆ పార్టీకి చెందిన ఒకే కుటుంబం మాత్రం కోట్లకు పడగలెత్తిందని ఎమ్మెల్యే రేవూరి ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, పేదవర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. “టీఆర్‌ఎస్ నేతలు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప ప్రజల సంక్షేమం కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. పరకాలలో అభివృద్ధి జరిగింది అనేది నిజం కాదు. జరిగింది అంతా కాగితాలపైనే” అని మండిపడ్డారు.

‘ముసలివాడంటూ’ అవమానించారు

ఎన్నికల సమయంలో తనను చల్లా ధర్మారెడ్డి ‘75 ఏళ్ల ముసలివాడు, ఏం చేస్తాడు’ అంటూ అవమానించారని ఎమ్మెల్యే రేవూరి గుర్తు చేశారు. కానీ ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించిన తర్వాత రెండేళ్లుగా నిర్విరామంగా పరకాల అభివృద్ధికే కట్టుబడి పనిచేస్తున్నానని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరుగుతున్నాయని వివరించారు. గత పాలనలో ఏ పని జరగలేదని, ఇప్పుడు మాత్రం అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే పరకాలను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయాలనే నిజమైన తపన ఉన్న నాయకులు కాంగ్రెస్‌లోనే ఉన్నారని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ఎన్నికల సమయంలో మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారని పార్టీ నాయకులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img