ఏనుమాముల మార్కెట్‌లో తడిసిన పత్తి, మక్కలు
అనుకోకుండా కురిసిన వర్షంతో తీరని నష్టం
కాకతీయ, వరంగల్ : ఏనుమాముల మార్కెట్‌లో పత్తి బస్తాలు తలంటు స్నానం చేశాయి. మంగళవారం ఉదయం అనుకోకుండా కురిసిన వానతో పత్తి, మక్కలు తడిసిముద్దయ్యాయి. మార్కెట్ యార్డు బిల్డింగ్‌కు సమీపంలో నిల్వ చేసిన పత్తి బస్తాలు.. ఆ బిల్డింగ్‌కు చెందిన దోని ద్వారా వచ్చిన వర్షపు నీటిలో తలంటు స్నానం చేసినట్లయింది. ఈ దృశ్యం రైతుల హృదయాలను కలిచివేసింది. కళ్లెదుటే కాలం చేసిన గాయం రైతుల పాలిట శాపంగా మారింది.


