శభాష్ సుష్మ
పోలీస్ స్పోర్ట్స్-మీట్‌లో బంగారు పతకాలు సాధించిన కానిస్టేబుల్
కాకతీయ ,కొత్తగూడెం : సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో జిల్లా ఏఆర్ విభాగంలో విధులు నిర్వర్తిసున్న మహిళా పోలీసు కానిస్టేబుల్ డి.సుష్మ 100 మీటర్లు,200 మీటర్లు పరుగు పందెం విభాగాలలో బంగారు పతకాలను సాధించారు.విశేష ప్రతిభ కనబరచి పంజాబ్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ఐదవ స్థానంలో నిలిచిన సుష్మ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడలు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.గెలుపోటములు సహజమని,మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేయాలని,ఓటమి చెందిన వారు నిరాశ చెందకుండా భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు తదితరులు పాల్గొన్నారు.


