శభాష్ రాజశేఖర్..!!
చెప్పాడు.. చేశాడు
కాకతీయ మహబూబాబాద్ ప్రతినిధి: జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో జన్మనిచ్చిన ప్రతి ఆడబిడ్డకు రూ. ఇస్తానన్న హామీ అప్పుడు చెప్పాడు… ఇప్పుడు చేసి చూపించాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డు బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీచేసిన గుండా రాజశేఖర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన వార్డులో ఆడబిడ్డకు జన్మనిస్తే ఆ కుటుంబానికి రూ. 5000 ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ ఎన్నికల తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి అభినందనలు తెలియజేసి రూ.5 వేల నగదును అందజేశాడు. నగదు తో పాటు చీర సారె పెట్టి సాంప్రదాయాన్ని సైతం చాటుకున్నాడు.

ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి
34వ వార్డు కౌన్సిలర్ కుండా రాజశేఖర్ ను ఆదర్శంగా తీసుకోవాలని స్థానిక అవార్డు ప్రజలు కొనియాడుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే వాళ్ళని మాత్రమే చూషామని, అందుకు భిన్నంగా రాజశేఖర్ చేస్తున్న కార్యక్రమాలను చూసి ప్రజలంతా సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారని స్థానికులు చర్చించుకోవడం గమనార్హం. ఇలాంటి రాజకీయ నాయకుడు ఉంటే ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా తీర్చగలుగుతారని భరోసా కలుగుతుందని చర్చించుకుంటున్నారు.


