- గురుకుల నిర్వహణలో సమర్థత చూపాలి
- పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత లక్ష్యం
- పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల నిర్వహణలో అధికారులు సమర్థత చూపాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు.సమీకృత కలెక్టరేట్‌లో గురువారం ఎస్సీ సంక్షేమ శాఖ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతిగృహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, పిచ్చి మొక్కలు తొలగించాలని, సెప్టిక్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు, ట్యూటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ప్రభుత్వం నిర్ణయించిన మెన్యూను తప్పనిసరిగా అమలు చేయాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. ఫ్రీ పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి ఎం. రవీందర్, సహాయ సంక్షేమ అధికారి శ్రావణ్ కుమార్, వసతిగృహ అధికారులు తదితరులు పాల్గొన్నారు.02


