సంక్షేమం… అభివృద్ధి కాంగ్రెస్ తోటే సాధ్యం
కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి
ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్
కాకతీయ, ఇనుగుర్తి : రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే డా”భూక్యా మురళి నాయక్, డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ లు అన్నారు.నియోజక వర్గ పర్యటనలో భాగంగా గురువారం ఇనుగుర్తి మండల కేంద్రంలోనీ కోమటిపల్లి ,పెద్ద తండా,చిన్నముప్పారం,లక్ష్మీపురం,చిన్న నాగారం,మ మట్యా తండ, చిన్యతండా,అయ్యగారిపల్లి,లాలూ తండా గ్రామాలలో పర్యటించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫీజ్ రేయంబర్స్మెంట్ ప్రవేశ పెట్టి ఎంతో మంది పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఆరోగ్య శ్రీ పథకం ప్రవేశ పెట్టి ఎంతో మంది పేదల ప్రాణాలను కాపాడుతున్న ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు సన్నబియ్యం ,ఉచిత విద్యుత్ ,మహిళలకు ఉచిత బస్ ,భూ భారతి,రైతు రుణమాఫీ,ఇందిరమ్మ ఇళ్లు,ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.అంతే కాకుండా గ్రామ ప్రజలే కేంద్రంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు.గత బిఆర్ఎస్ పాలనలో ఒక్క పేద వాడికి కూడా న్యాయం జరగలేదని అన్నారు.
గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి అప్పుడు మీ గ్రామాల అభివృద్ధి ఏంటో చూపిస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేసంద్ర మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి జిల్లా మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


