కాకతీయ, గీసుగొండ : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వరంగల్ మహా నగర పాలక సంస్థ 16వ డివిజన్ గొర్రెకుంట క్రాస్ ప్రధాన కూడలిలో గీసుగొండ సీఐ విశ్వేశ్వర్,ఎస్ఐ కుమార్ ఆధ్వర్యంలో వాహనాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వాహన దారుడు తప్పనిసరిగా వాహన పత్రాలను వెంట ఉంచు కోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. అలా పట్టుబడిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనిఖీల్లో పత్రాలు లేని వాహన దారులు, మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.


