గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాం
15 లక్షల సిసి రోడ్లను ప్రారంభించిన సర్పంచ్ సంధ్య
కాకతీయ, నెల్లికుదురు : గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని సర్పంచ్ యాసం సంధ్య రమేష్ అన్నారు. మండలం లోని నైనాల గ్రామం లో ఎంపీ పోరిక బలరాం నాయక్ నిధుల నుండి మంజూరి అయిన రూపాయలు 15 లక్షల విలువ గల మూడు సీసీ రోడ్ పనులను గ్రామ సర్పంచ్ యాసం సంధ్య రమేష్, గ్రామ ఉపసర్పంచ్ పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్ తో కలిసి బుధవారం ప్రారంభించినారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామానికి నిధులు మంజురి చేసిన ఎంపీ పోరిక బలరాం నాయక్ కి, మరియు మంజూరికి సహకరించిన గ్రామ పెద్దలు నాయిని శ్రీపాల్ రెడ్డి, పెరుమండ్ల జగన్ కి కృతజ్ఞతలు తెలిపినారు. భవిష్యత్ లో గ్రామానికి మరిన్ని నిధులు మంజూరి చేయాలనీ ఎంపీ కి విజ్ఞప్తి చేసినారు. సీసీ రోడ్ లు గ్రామంలోని 10,8,7,5,వార్డు లలో మంజురి అయినందుకు ఉపసర్పంచ్ పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్, వార్డ్ సభ్యులు ఏర్పుల శృతి సరేష్, ఆకుల జ్యోతి మల్లేష్, బొడ్డు విజయ్ కుమార్ లు కూడా ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపినారు.ఈ కార్యక్రమం లో గ్రామ మాజి ఎంపీటీసీ నంగునూరి ఉత్తరమ్మ, కారోబార్ ఉడుత యాకయ్య, గ్రామస్తులు నిమ్మకాంటి యాదగిరి,పెరుమాండ్ల సోమక్క, ఎండి సమీనా, చిర్ర విజయకుమార్, పూజారి సత్యం, మాచర్ల ఎల్లయ్య, చట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


