కల్లు గీత కార్మికులకు అండగా ఉంటాం
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
కాకతీయ, రాయపర్తి : గీత కార్మికుల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర సర్కారు లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని రైతు వేదిక ఆవరణంలోఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే శిక్షణ పొందిన కల్లుగీత కార్మికులకు రక్షణ కవచాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గీత కార్మిక వృత్తిలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరు ఈ రక్షణ కవచాలను ఉపయోగించాలని సూచించారు. మొత్తం ఆరు పరికరాలతో ఈ రక్షణ కవచం కిట్లు రూపొందించబడ్డాయన్నారు. గీత కార్మికులు ఇబ్బందులు పడకుండా రక్షణ కల్పించాలనే సదుద్దేశంతో రాష్ట ప్రభుత్వం అత్యాధునిక పద్ధతులతో రూపొందించబడిన కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేస్తుందని తెలిపారు.
అలాగే రాయపర్తికి చెందిన కుంట ప్రభాకర్ తల్లి కుంట బుచ్చమ్మ ఇటీవల మరణించగా ఎమ్మెల్యే బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి బుచ్చమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ స్వరూప, ఎక్సైజ్ ఎస్ఐ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హామ్యా నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, మాజీ టీపీసీసీ సభ్యుడు బిల్లా సుధీర్ రెడ్డి, వర్ధన్నపేట ఏఎంసి వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి, మాచర్ల ప్రభాకర్, కొండాపురం మాజీ సర్పంచ్ ఎనగందుల మురళి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మచ్చ రమేష్, ఆకుల సురేందర్, కళ్యాణ్ గౌడ్, కుంట రమేష్, మహమూద్, అఫ్రోజ్, రఫీ, వనజారాణి, ప్రవీణ్, చెవ్వు కాశినాధం తదితరులు పాల్గొన్నారు.


