- బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి
కాకతీయ, నల్లబెల్లి : కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మోసపూరితంగా ఇచ్చిన హామీలకు సంబంధించిన బాకీ కార్డులు’ ను బహిర్గతం చేస్తామని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు.
ప్రజలను తప్పుదోవ పట్టించిన గద్దెనెక్కిన కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానలు వెలుగులోకి తేవడం మా బాధ్యత అన్నారు. బి ఆర్ యస్ పార్టీ మండల, గ్రామ స్థాయి అధ్యక్షులు, కార్యదర్శులు తక్షణమే బాకీ కార్డులను గ్రామాల వారీగా ప్రజలకు పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు కాంగ్రెస్ హామీల అసత్యాన్ని బహిర్గతం చేయడంతో పాటు, బిఆర్ఎస్ శ్రేణులను రాబోయే ఎన్నికలకు సన్నద్ధం చేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. బిఆర్ఎస్ చేపట్టిన ఈ బాకీ కార్డుల కార్యక్రమం గ్రామస్థాయిలో రాజకీయ చైతన్యాన్ని పెంచి, ప్రజలకు నిజాలను తెలియజేయడమే లక్ష్యంగా కొనసాగిస్తామని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వరరావు, పోగుల చిరంజీవి క్లస్టర్ బాధ్యులు ఇంగ్లీష్ శివాజీ, మాజీ సర్పంచులు రాజారాం, మామిళ్ల మోహన్ రెడ్డి, లావుడియా తిరుపతి, గన్నబోయిన చేరాలు, గుండాల కుమారస్వామి, ఊరటి అమరేందర్, మాజీ ఎంపీటీసీ నూటెంకి సూరయ్య, పోడేటి ప్రకాశం, గ్రామ పార్టీ అధ్యక్షులు క్యాతం శ్రీనివాస్, మురాల ప్రతాపరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నూనావత్ దేవా, మామిళ్లపల్లి రాజు, నాగేల్లి శ్రీనివాస్, నాగెల్లి ప్రకాష్, గుమ్మడి వేణు, వైనాల మధు, పరికి నవీన్, మేడిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.


