గులాబీ జెండా ఎగరేస్తాం
బీఆర్ఎస్ 9వార్డు అభ్యర్థి వీరబత్తిని సదానందం
కాకతీయ, చేర్యాల : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సారథ్యంలో చేర్యాల మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురెస్తామని బీఆర్ఎస్ 9వార్డు అభ్యర్థి వీరబత్తిని మాధవి సదానందం ధీమా వ్యక్తం చేశారు. బుధవారం చేర్యాల మున్సిపాలిటీలోని 9వార్డులో కారు గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని పార్టీ కార్యకర్తలతో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని, అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటామని, ఆ అనుభవాన్ని కార్యదీక్షతో తీసుకొని గులాబీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. ముఖ్యంగా రైతులు యూరియా కోసం అల్లాడుతున్నారని ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి సహకార సంఘాల ఎదుట నిలబడుతున్నారని విమర్శించారు. మున్సిపాలిటీ పరిధిలోని 12, వార్డుల్లో మెజారీ స్థానాలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


