కాకతీయ, నెల్లికుదురు: రైతులందరికీ అందుబాటులో యూరియా ఉందని, అధైర్య పడవద్దని మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమకు శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల ప్రకారం అందరికీ యూరియా అందించే విధం గా రైతు భరోసా డేటా ప్రకారం ముందస్తు సమాచారం ఇచ్చి రైతులకు అందిస్తారని తెలిపారు.
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం, నెల్లికుదురు పరిధిలోని నెల్లికుదురు, బ్రాహ్మణకొత్తపల్లి, నైనాల రైతులకు ముందస్తు సమాచారాన్ని అందించి, 20 (ఇరవై టన్నుల) యూరియాను సక్రమంగా పంపిణీ చేయడం జరిగిందని ఇదే పద్ధతి ప్రకారం ప్రతీ రైతుకు యూరియా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
కార్యక్రమం లో తహసీల్దార్ సిహెచ్. నరేష్ , ఎంపీడీవో కుమార్, ఎస్సై చిర్ర రమేష్ బాబు వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రవీణ్, చందన, ప్రతిభ, మణికంఠ, పంచాయతీ కార్యదర్శులు రాజేష్, శరత్, పిఎసిఎస్ అధికార్లు శ్రీను, సుభాష్, పూర్ణ, సురేష్, నగేష్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


