epaper
Saturday, November 15, 2025
epaper

23న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2లో బలమైన వాదనలు వినిపిస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

*రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్యం

*23న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2లో బలమైన వాదనలు వినిపిస్తాం

*తెలంగాణ‌కు రావాల్సిన నీటి వాటాను వ‌దులుకోం

*తాగు, సాగు నీటితో సహా పరిశ్రమల నీటి వినియోగానికి చర్యలు

*71%నీటి వాటకై గట్టిపట్టు పడుతాం..

*65% తెలంగాణ‌ ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని ఇప్పటికే కేడ‌బ్ల్యూడీటీ ముందుంచాం

*తెలంగాణ‌ ప్రాజెక్టుల‌కు అడ్డుప‌డుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌..!

*నేను, సీఎం రేవంత్ రెడ్డి ఈ చర్చలలో పాల్గొంటాం.!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాల వివాద-2 విచారణలో తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 23 న జరగనున్న ఈ చ‌ర్చ‌ల్లో తాను, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్వ‌యంగా పాల్గొని ట్రిబ్యున‌ల్ ముందు వాద‌న‌లు వినిపిస్తామ‌ని చెప్పారు. తెలంగాణాకు చెందాల్సిన నీటివాటలో చుక్క నీరు కుడా వదులుకునే ప్రసక్తేలేదని ఆయన తేల్చి చెప్పారు.

ఈ నెల 23 నుంచి 25 వరకు దేశరాజధాని ఢిల్లీలో జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తాను స్వయంగా పాల్గొన బోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీలో 23 నుంచి 25 వరకు జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2 విచారణలో తెలంగాణ‌ ప్రభుత్వం అనుసరించాల్సిన అంశంపై శనివారం నీటిపారుదల శాఖా కేంద్ర కార్యాలయం జలసౌధ లో న్యాయనిపుణులు,నీటిపారుదల రంగ నిపుణులతో మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు.

నీటిపారుదల శాఖా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,ఇ. ఎన్.సి అంజద్ హుస్సేన్ సుప్రీంకోర్టు న్యాయవాది సి.ఎస్ వైద్యనాథ్‌,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇదే అంశంపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీకి చేరుకుని సమీక్షిస్తారని వెల్లడించారు. కృష్ణా జలాశయాల్లో తెలంగాణ‌ రాష్ట్ర వాటాను సాధించేందుకు బలమైన వాదనలు వినిపించేందుకు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని అన్నారు. వారిచ్చే నివేదికల ఆధారంగా న్యాయవాదులు తెలంగాణ‌ రాష్ట్రానికి చెందాల్సిన నీటివాటాపై వాదనలు వినిపించనున్నారని ఆయన పేర్కొన్నారు.

శాస్త్రీయంగా నీటి కేటాయింపుల‌పై గ‌తంలోనే విన‌తులు

కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2 ఎదుట 2025 ఫిబ్రవరి నుంచి వాదనలు కొనసాగాయ‌ని అన్నారు.
సమైక్యాంధ్రలో తెలంగాణ‌ ప్రాంతానికి జరిగిన అన్యాయంపై ప్రస్తావించారని ఆయన తెలిపారు. శాస్త్రీయంగా నీటి కేటాయింపులు, ఆంధ్ర‌ప్రదేశ్ చేపట్టిన అనధికార బేసిన్ల వివ‌రాలు, తెలంగాణ ప్రాంతంలో సాగునీటి అవసరాలు అందులో పొందు పర్చాన‌న్నారు. ఎప్పటికప్పుడు ఆంధ్ర‌ప్రదేశ్ ప్రభుత్వం కాలువల సామర్థ్యాల‌ను పెంచుకుంటూ గోదావరి, పట్టిసీమ, చింతలపూడి, పులిచింతల నీరు అక్రమంగా తరలించుకు పోతున్న అంశాలను ఇప్పటికే ట్రిబ్యునల్ ముందు ఉంచామన్నారు.

1956 జలవివాద చట్టం,2014 ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన విషయంపై వాదనలు వినిపించామన్నారు. 811 టీఎంసీల కృష్ణా జలాశయాలలో తెలంగాణ ప్రాంతానికి 71 శాతం కేటాయింపులు ఉండాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు 65% కేటాయింపులు ఉండాల్సిందేనన్నారు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లుగా నీటి కేటాయింపులు ఉండాలని అందుకు అనుగుణంగా తాజా సమాచారాన్ని ట్రిబ్యునల్ కు సమర్పించామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని జారవిడుచుకోబోమని మంత్రి పునరుద్ఘాటించారు.

80 టీఎంసీల అందుబాటులో ఉంచేలా వాదనలు వినిపిస్తాం

తాజాగా అధికారులు అందిస్తున్న నివేదికల ప్రకారం జూన్, జులై మాసాలలో ఇక్కడికి అవసరమైన నీటి కోసం 80 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచేలా వాదనలు వినిపించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఆపరేషన్ ప్రొటోకాల్ నిబంధనల ననుసరించి మిగిలిన నీటిని వినియోగించుకునే స్వేచ్ఛ తెలంగాణాకు ఉండేలా ట్రిబ్యునల్ ముందట ఉంచుతామన్నారు. ఐఎస్ఆర్.డబ్ల్యుడీ చట్టంలోని సెక్షన్ 4(1) ఏతో పాటు పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదకొండో షెడ్యూల్ పదో పేరాగ్రాఫ్ వంటి న్యాయపరమైన అంశాలను కుడా ఈ విచారణలో వాదించబోతున్నట్లు ఆయన వివరించారు. ఆంధ్ర‌ప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా వినియోగిస్తున్న 291 టీఎంసీల నీటి ఉదంతం వెలుగులోకి వచ్చినందున ఆ నీటిని పునర్విభజన చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

తెలంగాణ‌ ప్రాజెక్టుల‌కు అడ్డుప‌డుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌..!

ఆంధ్ర‌ప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ‌లో కడుతున్న ప్రాజెక్టులపై అడ్డుపడుతుండడంతో ఒకింత ఆలస్యం జరుగుతోంద‌ని ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. ప్రాజెక్ట్ ల నిర్మాణాలపై తెలంగాణా కు ఉన్న హక్కులను కుడా ట్రిబ్యునల్ ఎదుట జరిగే వాదనలలో వినిపిస్తామన్నారు. తమ వాదనలకు బలం చేకూరేలా ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణాల అంశాలతో కూడిన ప్రత్యేక జీ.ఓను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సన్నద్ద‌మ‌వుతోంద‌న్నారు. వీటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథ‌కాల సామర్థ్యం పెంపుతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం తాగునీటి అవసరాల కోసం కొత్తగా నిర్మిస్తున్న రిజర్వాయర్ లు,100 టీఎంసీల‌ను మళ్లించడానికి వీలుగా రూపకల్పన చేసిన జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్‌లు ఉన్నాయన్నారు.

ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తి చేయక పోవడం వల్లనే కృష్ణా జలాశయాలను తెలంగాణా వినియోగించుకో లేకపోయిందని ఆయన బీఆర్ఎస్ పాలకులపై మండిపడ్డారు. గత పాలకుల ఉదాసీనతతోటే ఆంధ్ర‌ప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుని పోయి ప్రయోజనం పొందిందని బీఆర్ఎస్ పాలకులపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే న్యాయంగా తెలంగాణ‌కు రావాల్సిన నీటి వాటాపై గట్టిపట్టు పడుతు న్నామన్నారు. అందుకు తగిన ప్రణాళికలు రూపొందించి ముందుకు పోతున్నామన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..!

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..! జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి.. కాక‌తీయ‌, హైదరాబాద్ : జూబ్లీహిల్స్...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : వాగ్గేయ‌కారుడు, క‌వి అందె...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img