కాకతీయ, వరంగల్: వరంగల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఇండ్లు కోల్పోయిన గాడిపెల్లి గ్రామ భూ నిర్వాసితులతో ఏర్పాటు చేసిన ఆర్ఎన్ఆర్ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య శారద ,అదనపు కలెక్టర్ సంధ్యారాణి లు పాల్గొన్నారు.
ఈ సమీక్షలో ఇండ్లు కోల్పోయినా 12 మంది భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే తీరుపై చర్చించారు. ఇండ్లు కోల్పోయినా నిర్వాసితుల సందేహాలను నివృత్తి చేశామని కలెక్టర్ తెలిపారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఇల్లు కోల్పోతున్న ప్రతి ఒక్కరికి సరైన నష్టపరిహారం చెల్లిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, కిల వరంగల్ తాసిల్దార్ శ్రీకాంత్, కలెక్టరేట్ ఏవో విశ్వ ప్రసాద్ సంబంధిత సిబ్బంది, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.


