ప్రజల ఎజెండాతోనే ముందుకు వెళ్తాం
* రెవెన్యూ డివిజన్ లక్ష్యంగా ఉద్యమిస్తాం
* ఏప్రిల్ 15 వరకు గ్రామ గ్రామాన జెండాలు ఎగురవేస్తాం
* జేఏసీ చైర్మన్ డా. ఆర్ పరమేశ్వర్
కాకతీయ, చేర్యాల: రాజకీయ ఎజెండాతో కాకుండా ప్రజల ఎజెండాతోనే రెవెన్యూ డివిజన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ అన్నారు. శనివారం చేర్యాల మండల కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో మండల కన్వీనర్ బొమ్మగాని అంజయ్య గౌడ్ అధ్యక్షతన వహించగా ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష చిరకాల కోరికను నెరవేర్చడం కోసం రాజకీయ పార్టీలు జెండాలు ఎజెండాలు పక్కనపెట్టి ప్రజల ఏజెండాతో ముందుకు వెళ్తామని అన్నారు. ఈనెల 25న మండల కమిటీల సమావేశాలు నిర్వహిస్తామని, ఏప్రిల్ 1 నుండి 15 వరకు గ్రామస్థాయిలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి 15వ తేదీన గ్రామ గ్రామాన రెవెన్యూ డివిజన్ జేఏసీ జెండాలు ఎగరవేస్తామని అన్నారు. నూతనంగా గెలిచిన సర్పంచులు రెవెన్యూ డివిజన్ సాధన కోసం తీర్మానాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అందే అశోక్, అందే బీరయ్య, బస్వగల్ల సిద్దయ్య, బుట్టి సత్యనారాయణ,కర్క తిరుపతిరెడ్డి, గుర్జకుంట సర్పంచ్ కాశెట్టి పాండు, బొమ్మగోని అంజయ్య, మాదాసు బాలకృష్ణ, ఈరి భూమయ్య, పిల్లి చంద్రం, జంగిలి యాదగిరి, తాడెం వెంకటస్వామి, పోలోజు వెంకటాద్రి, కుడిక్యాల బాల్ మోహన్, పొన్నబోయిన మమత, సుంకోజు రజిత, పాకాల ఇసాక్, సుందరగిరి భాస్కర్, శ్రీరామ్ మల్లేశం, బస్వగల్ల రమేష్, గూడెపు సుదర్శన్, గుండె ఉదయ్, టోనీ బక్కల్, ఎగుర్ల ఎల్లయ్య, బింగి పోశయ్య, గోమారపు నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.


