epaper
Sunday, March 1, 2026
epaper

ఆయుధాలు వ‌దిలేస్తాం

ఆయుధాలు వ‌దిలేస్తాం

కూంబింగ్ ఆప‌రేష‌న్స్ ఆపండి
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి
సోను దాదా నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం
మావోయిస్టు పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న‌
ఎంఎంసీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేర లేఖ‌
28న ప్రధాని మోదీ అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం
తాజాగా ఆయుధాల విర‌మ‌ణ‌పై మావోల ప్ర‌క‌ట‌న‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: సాయుధ పోరాట విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని.. మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే సాయుధ పోరాట విరమణపై తేదీని ప్రకటిస్తాం అని తెలిపింది. ఈమేరకు ఆ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ (ఎంఎంసీ) స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి అనంత్‌ పేరిట విడుద‌లైన బ‌హిరంగ లేఖ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈనెల 28న ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన మావోయిస్టులపై అనుసరించాల్సిన విధానాలకు సంబంధించి ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో కీలక సమావేశం జరుగనున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఆయుధాల విరమణపై ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. మావోయిస్టుల ప్రకటనపై మూడు రాష్ట్రాల సీఎంలు, కేంద్రం ఏ విధంగా స్పందించబోతుందో చూడాల్సి ఉంది.

ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలి

దేశం, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ, ఆయుధాలు త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని తమ పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌ బ్యూరో సభ్యుడు కామ్రేడ్‌ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు చంద్రన్న, సతీశ్‌ దాదా ఇటీవల ఈ నిర్ణయాన్ని సమర్థించారని తెలిపారు. ఎంఎంసీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ సైతం తుపాకులను వదిలేయాలని భావిస్తోందని, అయితే 3 రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు టైం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నామని అన్నారు.

ఇతర ఉద్దేశాలేమీ లేవు

ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు తమ పార్టీ కట్టుబడి ఉన్నందున ఈ నిర్ణయాన్ని సమష్టిగా చేరుకునేందుకు తమకు కొంత టైం పడుతుందని తెలిపారు. తమ సహచరులను సంప్రదించి, పద్ధతి ప్రకారం వారికి ఈ సందేశాలు తెలియజేసేందుకు టైం కావాలని కోరారు. ఇంత టైం అడిగేందుకు ఇతర ఉద్దేశాలేమీ లేవని వెల్లడించారు. త్వరగా కమ్యూనికేట్‌ చేసేందుకు తమకు వేరే సులభ మార్గాలు లేనందున ఈ వ్యవధిని కోరుతున్నామని, భద్రతా బలగాలు తమ కార్యకలాపాలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. పీఎల్‌జీఏ వారోత్సవాన్ని నిర్వహించబోమని, తమ అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తామని హామీ ఇస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img