నీళ్ల కోసం మరో తెలంగాణ ఉద్యమం చేస్తాం
బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి కి హరీశ్‌రావు వార్నింగ్
కాకతీయ, హైదరాబాద్ (జూలై 26) : గోదావరిలో తెలంగాణకు 967 టీఎంసీలు, ఏపీకి 513 టీఎంసీలు కేటాయించారని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ చర్చ సందర్భంగా ఇవి కూడా చర్చకు వచ్చాయని అన్నారు. కానీ తెలంగాణకు రావాల్సిన 967 టీఎంసీలను కూడా ఏపీ వ్యతిరేకిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన లేఖలను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్‌లో శనివారం నాడు నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సుకు హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.


