పత్రికా రిపోర్టర్లపై పరువు నష్టం దావా వేస్తాం
కార్పొరేటర్ కు ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ అని తప్పుడు వార్తలు ప్రచురణ
38 డివిజన్ కార్పొరేటర్ బైరాబోయిన ఉమా యాదవ్
కాకతీయ, ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ గ్రామంలో కార్పొరేటర్ కి ఇందిరమ్మ ఇండ్లు, ప్రొసీడింగ్ కూడా తీసుకున్నారు అని కొన్ని దిన ప్రతికలు తప్పుడు వార్త ప్రచురించాయని 38 డివిజన్ కార్పొరేటర్ ఉమా యాదవ్ ప్రెస్ మీట్ ద్వారా తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నేను ఎలాంటి ప్రొసీడింగ్ కాపీ తీసుకోలేదని, ఒకవేళ తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేయడానికైనా సిద్ధమేనని, ఇలాంటి తప్పుడు వార్తలు రాసిన పత్రిక రిపోర్టర్ లు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే తప్పుడు వార్తలు రాసిన వారిపై పరువు నష్టం, దావా కేసువేస్తామని కార్పొరేటర్ ఉమా యాదవ్ హెచ్చరించారు.


