బాకీ కార్డులతో కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడతాం
మాజీ జడ్పిటిసి పోలీసు ధర్మారావు
కాకతీయ,గీసుగొండ: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండ గడతామని మాజీ జడ్పిటిసి పోలీసు ధర్మారావు అన్నారు. మండలంలోని కొనాయిమాకుల గ్రామంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలతో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని,ఇప్పుడు బాకీ కార్డు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు చేసిన మోసాన్ని ప్రజలలోకి తీసుకెళ్తామన్నారు.వారి అసలైన వైఖరిని ప్రజలు గుర్తించాల్సిన సమయం వచ్చిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి పథంలో గ్రామాలను నడిపించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి వేణుగోపాల్, నాయకులు బోడకుంట్ల ప్రకాష్, జైపాల్ రెడ్డి,గుర్రం రఘు, ముంత రాజయ్య,మండల యూత్ అధ్యక్షుడు శిరిసే శ్రీకాంత్,కోట ప్రమోద్, దనుంజయ్,సంతోష్,రాజేశ్వర్ రావు,మార్గం రాజు, రంగారావు,అల్లఉద్దీన్ తదితర స్థానిక కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.


