గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : మాజీ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి
కాకతీయ, ములుగు ప్రతినిధి : గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కట్టుదిట్టంగా పనిచేయాలని మాజీ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి సూచించారు. మంగళవారం రామచంద్రపురంలో నిర్వహించిన బీఆర్ఎస్ మండల నాయకుల సమావేశానికి సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ములుగు మండలంలోని 10 గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించిన ఆయన, అభ్యర్థులు ప్రజలతో కలిసి గ్రామాభివృద్ధి దిశగా పార్టీ అభిప్రాయాలు, కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. సమన్వయంతో పనిచేస్తే గ్రామస్ధాయిలో బీఆర్ఎస్ ఆధిక్యం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ సభలో బిఆర్‌ఎస్ మల్లంపల్లి మండల అధ్యక్షుడు పొలం శ్రీనివాస్, మండల నాయకులు, గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


