- ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు
కాకతీయ, ఖానాపురం : మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం వెంటనే అందించాలని బీఆర్ ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖానాపురం తహసీల్దార్ నంగునూరు రమేష్ కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య మాట్లాడుతూ మండలంలోని 21 గ్రామపంచాయతీలో వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. తుఫాన్ ఎఫెక్ట్ తో మండల వ్యాప్తంగా సుమారు 20వేల ఎకరాల్లో పంట నష్టంతో రైతుకు అపారనష్టం జరిగిందని అన్నారు.
సీజన్ ప్రారంభం నుంచి రైతులకు యూరియా కష్టాలను అధిగమించి పంటలను కాపాడుకుంటే మొంథా తుఫాను వల్ల రైతుల నిండా మునిగారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు అయిందని గణాంకాలు చెప్తుంటే మండల వ్యవసాయ అధికారి మాత్రం కేవలం 6000 ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి రైతులకు ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుగులోత్ లక్ష్మణ్ నాయక్, మౌలానా, జాటోత్ బాలు నాయక్, వల్లేపు శ్రీనివాస్, మేకల కుమార్, ఆబోతు అశోక్, రాజు, తాజా మాజీ సర్పంచులు బాలకిషన్, సుమన్, సోమయ్య అశోక్, మాజీ ఎంపీటీసీలు పూలు నాయక్, రామస్వామి, గ్రామ పార్టీ అధ్యక్షులు మచ్చిక అశోక్, శ్రీనివాస్, తేజావత్ రెడ్యా, బాలు, ప్రవీణ్, రమేష్, నాయకులు ముద్దంగుల రవీందర్, బాబురావు, మల్లయ్య, నరసింహ ప్రతాపరెడ్డి, వీరేష్, కర్ర కృష్ణారెడ్డి, వెంకట్ నారాయణ, బోడ దేవా, పాలేల్లి జానయ్య, నామాల రవి, నాదెండ్ల సురేష్, పీసరి వెంకన్న అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


