మహనీయుల ఆదర్శాలను ఆచరించాలి
కాకతీయ, నర్సింహులపేట: మహనీయుల ఆదర్శాలను నేటితరం ఆచరించాలని, ఆశయాలను సాధించాలని ఎస్ఐ సురేష్ అన్నారు. నర్సింహులపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కేవీపీఎస్ 2026 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 28 ఏళ్ల సామాజిక ఉద్యమ ప్రస్థానంలో కెవిపిఎస్ తన ప్రత్యేకతను చాటుకుందని అగ్రగామిగా నిలిచి ఎన్నో విజయాలు సాధించిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పెదమాముల యాకయ్య, గ్రామ పంచాయతీ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, గునిగంటి మోహన్, చిర్ర సతీష్ గౌడ్, మందుల యాకూబ్, కురంది సురేష్, తిరుమలేశు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


