ఐక్యతతో సోదరభావంతో జీవించాలి
ఎమ్మెల్యే మురళీ నాయక్
కాకతీయ, నెల్లికుదురు : ప్రేమ, శాంతి, ఐక్యత, సోదరభావంతో జీవించాలనేదే క్రిస్మస్ పండుగ సారాంశమని ఎమ్మెల్యే డా. భూక్య మురళీ నాయక్ అన్నారు. గురువారం నెల్లికుదురు మండల కేంద్రంలోని సెయింట్ పీటర్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్రైస్తవ సోదరసోదరీమణులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులి వెంకన్న, గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, సత్యపాల్ రెడ్డి, యాదవ రెడ్డి, లక్ష్మారెడ్డి, బాలాజీ నాయక్, సంఘ కాపరి అబ్రహం, వివిధ గ్రామాల సర్పంచులు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు


