కాకతీయ, హనుమకొండ : జిల్లా స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడా సెలక్షన్స్ శనివారం అట్టహాసంగా జేఎన్ఎస్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి నిట్ ఫిజికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు పని ఒత్తిడికి లోను కాకుండా క్రీడలపై ఆసక్తి చూపించి ఇలాంటి పోటీల్లో పాల్గొనడం అభినందనీమని అన్నారు. ఉద్యోగులకు పలు సూచనలు, సలహాలు అందించారు. జిల్లా యువజన క్రీడా అధికారి గుగులోత్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. డాక్టర్ రవికుమార్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ఉన్నత స్థాయిలో రాణించి పలువురి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రవికుమార్ డీఎస్ఏ ఆఫీస్ ఆవరణలో మొక్కలు నాటగా, నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్‌లు, ఆఫీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


