గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి
*తహసిల్దార్: రమేష్ బాబు
కాకతీయ,నర్సింహులపేట: తహసిల్దార్ రమేష్ బాబును కౌసల్యాదేవిపల్లి గ్రామసర్పంచ్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి,ఉపసర్పంచ్ రవి మర్యాద పూర్వకంగా సోమవారం రోజున కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేసి ప్రజల మన్నలను పొందాలని సూచించారు.ఈకార్యక్రమంలో బి ఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు బానోత్ సురేష్, మాజీ సర్పంచులు చంద్రారెడ్డి, నరసింహారెడ్డి,వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.


