స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి
కాకతీయ, నల్లబెల్లి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో బూత్ అధ్యక్షుల సమావేశం సోమవారం జరిగింది. సమావేశానికి ప్రధాన అతిథిగా విచ్చేసిన రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి బూత్‌లో బలమైన నిర్మాణం ఉండాలి. అధిక స్థానాల్లో విజయాలు సాధించేలా ముందస్తుగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించిన నిధుల వివరాలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో కోటి రాజిరెడ్డి, నాగరాజు, తిరుపతి, కుమారస్వామి, నరేష్, యాదగిరి, భూక్యా మైభూ, మర్రి నాగరాజు, కృష్ణ, పున్నం కృష్ణమూర్తి, మనోహర్, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.


